దేవుడు  కూడా మనుషుల రూపంలో అప్పుడప్పుడు అవతరిస్తాడన్న నమ్మకం చాలా మతాల్లో ఉంది. అలాంటిదే ఓ నమ్మకం ఇప్పుడు మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఆరు నెలల వయసున్న ఓ చిన్నారి ఏకంగా అమ్మవారి అవతారం అంటూ జనం పూజలు చేస్తున్నారు. ఆ పసిపాప నుదిటిపై కుంకుమ రంగులో మచ్చలు ఉండటమే ఇందుకు కారణం. ఈ మచ్చలు ఆ పాప పుట్టినప్పటి నుంచి చిన్నగా ఉన్నాయి. ఆ తర్వాత అవి క్రమంగా పెరిగాయని చెబుతున్నారు.


వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర హింగోలీలోని కపడసింగి తండాలో ఈ విచిత్రం జరిగింది. సుభాశ్‌ అనే దంపతులకు ఆరు నెలల క్రితం ఈ పాప జన్మించింది. పుట్టుకతోనే బాలిక నుదుటి భాగంలో ఎరుపు, పసుపు రంగు మచ్చలు ఉన్నాయి. అవి వయసుతోపాటే పెరుగుతున్నాయి. క్రమంగా కుంకుమ రంగులోకి మారాయి. దీంతో ఆ పాప నుదురు మొత్తం కుంకుమ రంగులోకి వచ్చేసింది. దీంతో స్థానికులు ఆ పాపను అమ్మ వారి అవతారంగా భావిస్తున్నారు. అమ్మవారుగా భావించి పూజలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: