అయోధ్యలో రామాలయం.. ఎందరో హిందువుల జీవిత కాల స్వప్నం. రాముడికి, అయోధ్యకు హిందువుల్లో ఉన్న సెంటిమెంట్లు అలాంటివి.. మొత్తానికి ఇప్పుడు అయోధ్యలో రామాలయం నిర్మాణం అవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఆలయ నిర్మాణం వేగంగా సాగుతోంది. సరే.. ఇంతకీ ఈ ఆలయం కోసం ఎంత ఖర్చవుతుందో మీకేమైనా తెలుసా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకూ ఎంత ఖర్చయిందో తెలిస్తే షాక్ కావడం ఖాయం.

ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1800 కోట్ల దాకా ఖర్చుకావొచ్చునని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఓ ప్రకటన వెలువరించింది. తాజాగా ఈ ట్రస్ట్‌ ఫైజాబాబ్‌ సర్క్యూట్‌ హౌస్‌లో సుదీర్ఘంగా సమావేశమైంది. రామాలయ నిర్మాణాన్ని సమీక్షించింది. కొత్తగా ఎలాంటి విధివిధానాలు అవలంభించాలనే అంశంపై చర్చించి ఆమోదం తెలిపింది. ఈ కీలక సమావేశానికి మొత్తం 15 మంది ట్రస్టు సభ్యులు హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: