ఉద్యోగాల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక ప్రభుత్వ జాబ్ కావాలన్న యువకుల కోరికలను వీరు క్యాష్ చేసుకుంటున్నారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు కేటుగాళ్లు దాదాపు 20 మంది యువకులను మోసం చేశారు. ఇలాంటి కేటుగాళ్లను నమ్మవద్దని తిరుమల ఏఎస్పీ ముని రామయ్య తెలిపారు. ఇటీవల బాలకృష్ణ అనే నిందితుడు నిరుద్యోగ యువకులను ఆసరా చేసుకుని కోట్లు వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


ఈ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తిరుమల ఏఎస్పీ ముని రామయ్య  తెలిపారు. 16 మందిని యువకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రాధమిక దర్యాప్తు తేలిందని తిరుమల ఏఎస్పీ ముని రామయ్య అన్నారు. తితిదేలో కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించారని తిరుమల ఏఎస్పీ ముని రామయ్య అన్నారు. 1 కోటి 60 లక్షలు యువకుల నుంచి తీసుకున్నారన్న తిరుమల ఏఎస్పీ ముని రామయ్య .. తిరుపతి నగరపాలక సంస్ధకు సంబంధించిన ఇద్దరు ఉద్యోగులు ఇందులో ఉన్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd