అమరావతి రైతుల పాదయాత్రకు ఎలా అడ్డుకుంటారో చూస్తామని టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు అంటున్నారు.  వైసీపీ , మంత్రులు, ప్రజా ప్రతినిధులకు టిడిపి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కూన రవి కుమార్ సవాల్ విసిరారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు ఆవేదన,ఆక్రందన తెలియజేయడానికి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటామనడం కరెక్టు కాదని కూన రవి కుమార్  అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్పీకర్, మంత్రులు పాదయాత్రపై దారుణంగా మాట్లాడటంపై  కూన రవి కుమార్  ధ్వజమెత్తారు.

శ్రీకాకుళం జిల్లాకు పాదయాత్రగా వచ్చే రైతాంగానికి వెన్నంటి ఉంటామని కూన రవి కుమార్  తెలిపారు. 3 రాజధాని కోసం మూడేళ్లుగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రూపాయలైనా ఖర్చు పెట్టారా అని కూన రవి కుమార్ ప్రశ్నించారు. స్పీకర్ తమ్మినేని తో పాటు జిల్లా మంత్రులు జోకర్ల మాదిరిగా మాట్లాడుతున్నారని కూన రవి కుమార్  విమర్శించారు. ఇద్దరు మంత్రులు మూడేళ్లలో జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా అని కూన రవి కుమార్  ప్రశ్నించారు. శ్రీకాకుళం నడిబొడ్డులో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు కబ్జా చేశారని కూన రవి కుమార్  ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: