ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 30 శాతం వరకు పెరిగాయి. ఈనెల 17 వరకు 8.36 లక్షల కోట్ల పన్నులు వసూలైనట్లు కేంద్రం పేర్కొంది. వీటిలో 1.35 లక్షల కోట్ల ముందస్తు చెల్లింపులు  సర్దుబాటు చేసిన తర్వాత 23 శాతం పెరిగి 7 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వచ్చాయి. 


2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈనెల 17 వరకు 8లక్షల 36 వేల 225 కోట్ల స్థూల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 6లక్షల 42 వేల 287 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో కార్పొరేట్ ఆదాయపు పన్ను నుంచి 4.36 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్ను కింద 3.98లక్షల కోట్లు వసూలైంది.  ప్రత్యక్ష పన్నుల వసూళ్లు వేగంగా పెరుగుతున్నాయి.


మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడాన్ని ఇది స్పష్టంగా సూచిస్తోంది. ప్రభుత్వ నిర్ధిష్ట విధానాలతోపాటు... సాంకేతిక పరిజ్ఞానంతో ప్రక్రియలను సరళీకృతం చేయడం, పన్ను లీకేజీలను అరికట్టడం ద్వారా పన్నుల వసూళ్లు పెరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: