ఏపీ రాజధాని అమరావతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అయితే.. రాజధానిపై సుప్రీంలో ప్రభుత్వం వేసిన పిటిషనుపై ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్  పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ తేలకుండా ఎన్నికలు వరకు వాయిదాలు వేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అంటున్నారు.


అయితే..  కొత్త సీజేఐకు ఏపీ వ్యవహారాల పట్ల.. సీఎం జగన్ పట్ల అవగాహన ఉందని పయ్యావుల పేర్కొన్నారు. సీజేఐ లలిత్ గతంలో జగన్ తరపున వివిధ కేసుల్లో అడ్వకేటుగా ఉండడం వల్ల ఏపీ విషయంలో పూర్తి అవగాహన ఉందని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్  పయ్యావుల కేశవ్  గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో పూర్తి అవగాహన ఉన్న న్యాయమూర్తి ప్రస్తుతం సీజేఐగా ఉండడం వల్ల రాజధాని విషయంలో  న్యాయం జరుగుతుందని నమ్ముతున్ననని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్  పయ్యావుల కేశవ్  తేల్చి చెప్పారు.  రాజధానిపై నిర్ణయం చేసే అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు తీర్పూ వచ్చిందని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్  పయ్యావుల కేశవ్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: