ఎన్నికల సమయంలో  మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలనుమోసం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మద్యపాన నిషేదం హామీ ఏమైందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌  ప్రశ్నించారు. సొంత వ్యాపారంతో ప్రజలకు నాణ్యతలేని మద్యం అమ్ముతూ..ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.


మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఈ మద్యాన్ని అమ్మకుండా నిషేదించిందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గుర్తు చేశారు. శాస్త్రవేత్తలు మద్యం తాగటం వలన అనారోగ్యానికి గురవుతారని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌  అన్నారు. మద్యపాన నిషేదంపై రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ .. బార్‌ షాపులు రెండుకోట్లు పలుకుతుంటే మద్యంపై ప్రభుత్వం ఎలా దోచుకుంటుందో అర్థమవుతుందన్నారు. మద్య నిషేధం హామీని జగన్ సర్కారు తక్షణం అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: