ఈ ప్రకృతిలో ఎన్నో జీవాలున్నాయి. ఈ జీవుల మధ్య ఓ వలయం ఉంది. ఆహార గొలుసులు ఉన్నాయి. మనిషి వాటిని ధ్వంసం చేస్తున్నాడు. దీనివల్ల ప్రకృతి ప్రకోపించే ప్రమాదం ఉంది. అందుకే.. అంతరించిపోతున్న కొన్ని జాతులను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అంతరించిపోతున్నరాబందులను కాపాడేందుకు పంజాబ్ లో అధికారులు వినూత్న పద్ధతిని పాటిస్తున్నారు.

రాబందుల సంరక్షణ కోసం పఠాన్ కోట్  వన్యప్రాణి విభాగం అధికారులు చండోలా ప్రాంతంలో ఓ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. దానికి 'వల్చర్స్ రెస్టారెంట్' అని పేరు పెట్టారు. రాబందుల ఆకలి తీర్చేందుకు మంసాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. 2012లో అనివార్య కారణాల వల్ల మూతపడ్డ ఈ  రెస్టారెంట్ ను గతేడాది తిరిగి ప్రారంభించారు. రాబందులకు ఆహారంగా వేసే మాంసాన్ని ల్యాబ్ లో పరీక్షించిన తరువాతే వినియోగిస్తున్నారు. మొదట్లో 30 నుంచి 40 రాబందులు ఇక్కడకు వచ్చేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 350 నుంచి 400 వరకు ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: