విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానంలో నిర్వహించే దసరా మహోత్సవాలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు దేవస్ధానం అధికారులు ఆహ్వానం అందించారు. దేవస్దానం కార్యనిర్వహణాధికారిణి భ్రమరాంబ, వేదపండితులు రాజ్ భవన్‌లో గవర్నర్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందచేశారు. నవరాత్రి వేడుకలలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 26వ తేదీ నుండి వచ్చే నెల ఐదవ తేదీ వరకు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఐదో తేదీ సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో హంస వాహన తెప్పోత్సవం నిర్వహిస్తామని ఈవో గవర్నర్ దంపతులకు వివరించారు. భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. అమ్మవారిని సందర్శించుకుంటానని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. వేద పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించగా, ఈవో స్వామి వారి ప్రసాదాలు అందచేశారు. అంటే ఇక దసరా సంబరాలు మొదలవుతాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: