రాజధాని అమరావతి పాదయాత్రలో పాల్గొనే మహిళలు మద్యం సేవిస్తున్నారంటూ వైసీపీ మద్ధతుదారుడు బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై పాదయాత్ర చేస్తున్నరైతులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఆ పార్టీలో మహిళలను గౌరవించే సాంప్రదాయం లేదని అమరావతి రైతులు ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇచ్చి రోడ్డున పడి పాదయాత్ర చేస్తుంటే అవమానించేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విమర్శలు చేస్తున్న వారి ఇళ్లలోనూ మహిళలు ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలని రైతులు హితవు పలికారు.


రాష్ట్ర ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్లినా అమరావతి నుంచి రాజధాని మారదని రైతులు అంటున్నారు. తమ పాదయాత్ర రాష్ట్ర ప్రజలను మేల్కొల్పేలా సాగుతోందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పు అమలు చేయకుండా కాలయాపన చేసి... ఆరు నెలల తర్వాత సుప్రింకోర్టుకు వెళ్లారన్నారు. ఏ కోర్టుకు వెళ్లినా అమరావతి నుంచి రాజధాని మారదని స్పష్టం చేశారు. కేవలం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: