పెగాసెస్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం కొండను తవ్వి, దోమను కూడా పట్టలేదని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. పెగాసెస్ పై తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేకుండా హౌస్ కమిటీ వేశారని.., చరిత్రలో ఇలాంటి కమిటీ లేదని  పయ్యావుల కేశవ్  మండిపడ్డారు. పెగాసస్ జరిగిందా లేదా అనే ఒక్క పదం కూడా ఎక్కడా లేదని పయ్యావుల కేశవ్  దుయ్యబట్టారు. పెగసస్ వాడినట్లు అనుమానం ఉందని కూడా నివేదికలో చెప్పలేకపోయారని పయ్యావుల కేశవ్ అన్నారు.


ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతుందని.. దమ్ముంటే ఈ కేసు విచారణ కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వాలని పయ్యావుల కేశవ్‌  సవాల్‌ విసిరారు. కమిటీ నివేదికతో పాటు మూడేళ్ళ సమాచారం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాలని డిమాండ్‌ చేశారు. నివేదిక బయటకు రాకుంటే ఎదో జరిగిపోయిందని చెప్పేవారని పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: