మరోసారి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి వార్తల్లోకి వస్తోంది. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ మరోసారి  చేస్తోంది. అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరిని, అతని భార్యను సీబీఐ అధికారులు పులివెందులలో విచారించారు. ఆరు నెలల్లో దస్తగిరికి పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల నుంచి ఎదురైన ఇబ్బందులు, బెదిరింపులపై సీబీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.


ఈ కేసులో కీలక సాక్షి.. డ్రైవర్ దస్తగిరిని మరోసారి సీబీఐ విచారించడం కలకలం సృష్టిస్తోంది. వివేకా హత్య కేసులో సాక్షులను కొందరు నిందితులు బెదిరిస్తున్నారని..  కేసు విచారణ ఏపీలో కాకుండా హైదరాబాద్ కు మార్చాలని ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు మళ్లీ దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే గతంలోనూ చాలాసార్లు సీబీఐ కేసు  చేధించినట్టే కనిపించింది. కానీ ఏ ఫలితం లేదు. మరి ఈసారి కూడా అంతేనా.. ఏదైనా అరెస్టులు ఉంటాయా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: