సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ వార్తను వాట్సప్‌లో స్ప్రెడ్ చేశారన్న ఆరోపణపై ఆయన్ను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. 73 ఏళ్ల వయస్సున్న సీనియర్ జర్నలిస్టు అంకబాబు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. అయితే.. ఆయన అరెస్టుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అంకబాబు అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు.

వాట్సప్ లో ఒక వార్తను ఫార్వర్డ్ చేసిన కారణం గానే అరెస్ట్ చెయ్యడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. అక్రమ కేసులు, అరెస్ట్ లతో సీఐడీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుందని చంద్రబాబు మండిపడ్డారు. అరెస్టుకు ముందు 41ఏ నోటీసుల ఇవ్వాలన్న బుద్ధి సీఐడీకి లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన న్యాయస్థానం ఆదేశాలను పక్కనబెట్టి సమాజ విధ్వంసకుడు జగన్ రెడ్డి ఆదేశాలను సీఐడీ పాటించడం సిగ్గుచేటని చంద్రబాబు దుయ్యబట్టారు. వెంటనే అంకబాబును బేషరుతుగా విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: