ఏపీ అసెంబ్లీలో ఇటీవల లేబర్ కోడ్స్, రూల్స్ బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే.. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్రం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం కనీసం కార్మిక సంఘాలతో చర్చ లేకుండా హడావుడిగా ఆమోదించడానికి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని ఆరోపిస్తున్నాయి. దీన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సిఐటియూ నేతలు మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేతనాలు ,పారిశ్రామిక సంబంధాలు మరియు వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్స్ పై కేంద్రం సూచనలతో రాష్ట్రంలో పై కోడ్స్ కు అనుబంధంగా రూల్స్ ను ప్రతిపాదించిందని కార్మిక నేతలు అంటున్నారు. పార్లమెంట్‌లో చర్చ లేకుండా లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది కార్మికుల కుటుంబాలకు సంబంధించిన ఈ అంశంపై సంఘాలతో చర్చ లేకుండా ఫైనలైజ్ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కేంద్రం ప్రతిపాదించిన లేబర్ కోడ్లను ఏకపక్షంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ధోరణి సరైంది కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: