ఆహారపు అలవాట్లు  మారటంవల్లనే చిన్న వయసులోనే చక్కెరవ్యాధి, రక్తపోటుకు గురవుతున్నారు. అనంతపురంలో షుగర్, బీపీ వ్యాధి గ్రస్తులకు 30 రోజులు తృణధాన్య ఆహారంతో పరిశోధన నిర్వహించి, ఫలితాలను నిపుణులు వెల్లడించారు. తృణధాన్యాలు ఆరోగ్యంగా జీవించటానికి దేవుడు ప్రసాదించిన ఆహారంగా నిపుణులు తెలిపారు. గ్రామాల్లో రైతుల ద్వారా మిల్లెట్ పంటలను సాగుచేయిస్తూ, ప్రజలకు  ఆరోగ్యవంతమైన ఆహారం, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరేలా ఆర్డీటీ సంస్థ అండగా నిలుస్తోంది.

కురుగుంట గ్రామంలో వివిధ వయసుల 30 మంది చక్కెర వ్యాధి, బీపీ ఉన్న వారిని ఎంపిక చేసి ముప్పై రోజులపాటు తృణధాన్య  ఆహారం అందించిందీ సంస్థ. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని మిల్లెట్  ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. కొర్ర, సామ, ఆరికల ఆహారంతో  చక్కర వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఈ పరిశోధనలో తేలింది. అందుకే మిల్లెట్‌ ఆహారంతో వ్యాధులను కంట్రోల్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: