అన్ని రంగాల్లోనూ డ్రోన్ల వాడకం పెరిగిపోతోంది. ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో రానున్న కాలంలో సాంకేతికతకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి వస్తోంది.  ఇప్పటికే పరిశోధన చేసేవారు ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతి ఇంజనీరు తాము చదివిన చదువుతోపాటు పరిశోధనకు సమయాన్ని కేటాయించి తమ వంతుగా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పరిస్థితి రావాలి. వీటిలో భాగంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ లు కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

ఇప్పటికే డ్రోన్లపై పరిశోధన చేసి విజయం అనేక మంది విజయం సాధించారు. ఈ పరిశోధనలు అక్కడితో ఆపకుండా రీసెర్చ్ ల్యాబ్ ద్వారా మనిషి డ్రోన్ పై ప్రయాణించే విధంగా 2025 కి రూపొందిస్తారని ఆశాభావం వ్యక్తమవుతోంది. డ్రోన్ల  స్పేర్ పార్టులకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని పరిస్థితి లేకుండా ఇక్కడే తక్కువ ఖర్చుతో స్పేర్ పార్ట్స్ లను తయారు చేసేందుకు ల్యాబ్‌లు కూడా మన దగ్గర వస్తున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు లో ఫోర్త్ ఆపిల్ రీసెర్చ్ ల్యాబ్ ప్రారంభమైంది. దీన్ని సిబిఐ మాజీ జాయింట్  డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: