కరవు ప్రాంతమైన అనంతపురం ప్రకృతి సాగులో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక్కడి ప్రకృతి సాగు గురించి తెలుసుకుని విదేశీయులు సైతం పరిశోధనలకు వస్తున్నారు. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై విధేయులు ఏపీ వ్యవసాయ అధికారులతో అధ్యయనం చేశారు. దాదాపు 15 దేశాల ప్రతినిధులు మూడు రోజులు పాటు జిల్లాలో పర్యటించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంద్రప్రదేశ్ లో ఆరు లక్షల మంది రైతులు  ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు వారు గమనించారు.


అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో పంటల సాగుపై అధ్యయనం చేసినట్లు వారు తెలిపారు. తర్వాత ఆర్డీటీ ఏకలజీ సెంటర్ లో గ్లోబల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విదేశీయులకు అవసరమైన సహాయం అందిస్తామని ఆయన సమావేశంలో ప్రతినిధులకు తెలిపారు. సమావేశంలో విదేశీయుల అభిప్రాయాలను మంత్రి కాకాని గోవర్ధన్ తెలుసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: