వైద్య రంగంపై సీఎం జగన్ తప్పుడు ప్రకటనలు మాని ముందు ఎయిమ్స్ నీటి సమస్యను పరిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ కు కనీసం నీటి సరఫరా చేయలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలంటూ మండిపడ్డారు. అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.


అసలు వైకాపా ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో  అబద్దాలు  చెప్పిన ముఖ్యమంత్రి... తానుంటున్న మునిసిపాలిటీ  నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారని  నిలదీశారు. స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి... వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: