కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పధకాలకు రాష్ట్ర ప్రభుత్వ పేర్లతో అమలు చేస్తుందని.. కేంద్రం విడుదల చేసే నిధులతో అమలు చేసే పధకాలోనూ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం లేదని కేంద్ర మంత్రి ఎ. నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.


నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని ప్రభుత్వానికి కాదన్న కేంద్ర మంత్రి ఎ. నారాయణ స్వామి.. 18శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించానని.. కొన్ని డిపార్ట్మెంట్ల పని అసంపూర్తిగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 125 గ్రామాల్లో ఫ్లోరిన్ నీటి సమస్య ఉంది దీంతో అనేకమంది ప్రజలు మృత్యువాత పడుతున్నారన్న కేంద్ర మంత్రి ఎ. నారాయణ స్వామి.. దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి తుది నివేదిక వస్తే నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. హెల్త్ కార్డులకు విడుదల చేసిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం లేదని... ఇలా అయితే దానికి కేటాయించే నిధులు ఆపివేస్తామని ఆయన హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: