ఎక్కడా న్యాయం జరగకపోతే.. మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడం చూస్తుంటాం. అలా ఈ ఏడాదిన్నరలో ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 2,800 కేసుల వరకు కమిషన్ వద్దకు వచ్చాయట. ప్రతి రోజు 20 నుంచి 25 రోజులు ఫిర్యాదులు వస్తున్నాయట. విజయవాడలో పర్యటిస్తున్న మానవ హక్కుల కమిషన్ సభ్యులు శ్రీనివాసరావు, దండే సుబ్రమణ్యం ఈ విషయాలు చెప్పారు.

గుంటూరులోనూ మానవహక్కుల కమిషన్ రెండ్రోజుల పాటు పర్యటించింది. జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన క్యాంపు కోర్టులో కమిషన్ ఛైర్మన్ ఎం. సీతారామ్మూర్తి, కమిషన్ సభ్యులు దండే సుబ్రమణ్యం, శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 94 కేసులు రాగా... 37 కేసులను ఈ కమిషన్ సభ్యులు పరిష్కరించారు. కేసుల పరిష్కారంతోపాటు మానవ హక్కుల కమిషన్ పై ప్రజలకు అవగాహన కల్గిస్తున్నామని కమిషన్ సభ్యుడు శ్రీనివాసరావు చెప్పారు. రాయలసీమలో రెవెన్యూ శాఖ, కోస్తాంధ్రలో పోలీసు శాఖపైన ఫిర్యాదులు అందాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

hrc