నారా లోకేశ్ టీడీపీ అగ్రనేత. రాష్ట్రమంతటా ఆయన పర్యటించాల్సి ఉంటుంది. ఎన్నో బాధ్యతలు. అయినా సరే.. నారా లోకేశ్ మాత్రం ఓ పని ఆపట్లేదు. అదే మంగళగిరి ప్రాంతంలో పర్యటనలు. తాజాగా ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దేవరపల్లిలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. స్థానిక నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు.


జగన్ సర్కారు ప్రజలపై వేసిన పన్నుల భారాన్ని, నిత్యావసర సరుకుల ధరల వివరాలను కరపత్రం రూపంలో ప్రజలకు తెలియజేశారు. గ్రామంలో లోకేష్ పర్యటిస్తుండగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రజలతో కలసి చీకట్లోనే తిరిగారు. పెరిగిన ఇంటి, చెత్త పన్ను, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అడ్డగోలుగా పన్నులు వేసి ప్రజలను దోచుకుంటున్నారని లోకేష్ చెప్పారు. పన్నుల భారం తగ్గాలంటే చంద్రన్న ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: