విజయవాడలోని పీడబ్య్లూడీ మైదానంలో 360 కోట్ల వ్యయంతో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తామని గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ హామిని మరిచిపోయిందని దళిత సంఘాల నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పటికే అంబేడ్కర్ స్మృతి వనంలో ఉన్న ఆయన విగ్రహాలను అపహరణకు గురైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా అంబేడ్కర్ స్మృతి వనం పనులను ప్రారంభించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని నేతలు హెచ్చరించారు. అమరావతి అంబేద్కర్ స్మృతి వనం లో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను  దళిత బహుజన ఐకాస నేతలు తొలగించారు. స్మృతి వనంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో  అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా  పెరిగిన పిచ్చి మొక్కలను కన్వీనర్ చిలకా బసవయ్య అధ్వర్యంలో నాయకులు పిచ్చి మొక్కలు తొలగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: