గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో ఆముదాలవలస నియోజకవర్గంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబోతున్నారు. అక్కడే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 9వ తేదీన నిర్వహించే గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ లో యువత, క్రీడాకారులు, విద్యార్థులు,మహిళలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని రన్ ను విజయవంతం చేయాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం కోరారు.

ఆయన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డితో కలసి ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ గత సంవత్సరం మన రాష్ట్రంలో నిర్వహించిన కార్యక్రమం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిందన్నారు. ఈ ఘనత గ్రేట్ క్యాన్సర్ ఫౌండేషన్ కి ఉందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: