రాయలసీమ రైతులకు ఇప్పుడు సీఎం జగన్ ఇచ్చిన ఆఫర్‌పై చర్చ జరుగుతోంది. రాయల సీమ రైతులు ముందుకొస్తే ఎకరానికి 30 వేల రూపాయలు చెల్లించేలా సోలార్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందని సీఎం జగన్ ఇటీవల అన్నారు. ప్రభుత్వమే ఈ భూములను లీజుకు తీసుకుని కంపెనీలకు ఇస్తుందని.. ఏటా 5 శాతం లీజు పెంచుతుందని.. ఈ ప్రతిపాదనలకు రైతులను ఒప్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు.

ఇటీవల నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్ కో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. అయితే.. ఒకే చోట 1500 ఎకరాలు, ఆపైన భూమి లభిస్తేనే.. ఈ ఒప్పందాలు జరుగుతాయి. మరి ఆ స్థాయిలో రైతులు సంఘటితం అవుతారా.. ఈ ఆఫర్‌ పై రైతులు ఎలా స్పందిస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: