చంద్రబాబుకు కోపం వచ్చింది. అదేదో జగన్‌ పైన కాదండోయ్.. సొంత పార్టీ నేతలపైనే.. అవును.. ఉమ్మడి గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతల పై అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు తరచూ సమావేశం కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎవరికివారే ముదుర్లులా ఉన్నారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతి నిర్వీర్యం పై ప్రజల్లో కసి ఉన్నా, నేతలు బాధ్యతగా వ్యవహరించట్లేదని ఫైర్ అయ్యారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సమస్యలపై ఐక్య పోరాటాలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 12న గుంటూరు లో సర్వసభ్య సమావేశం నిర్వహించాలని చంద్రబాబు  నిర్ణయించారు. అక్రమ కేసులు బనాయించే పోలీసులపై పోరాటం చేయనున్నట్లు నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ప్రతి చిన్న విషయానికి తెలుగుదేశం కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టేవారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఐక్యంగా పనిచేయాలని గుంటూరు జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: