ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకురావాలంటే మీడియా దృష్టిని ఆకర్షించాలి. మీడియాలో రావాలంటే ఏదైనా వెరైటీగా చేయాలి.. ఇదే పని చేశారు కృష్ణా జిల్లా టీడీపీ నేత కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో మాజీమంత్రి కొల్లురవీంద్ర పడవ ప్రయాణం చేశారు. కానీ అది సముద్రంపై కాదు.. ప్రధాన కూడలి రహదారిపైన. వర్షంతో జలమాయమైన మచిలీపట్నం కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ వరకు ఉన్న పడవేసుకుని ప్రయాణించి టీడీపీ నేత కొల్లు రవీంద్ర తన నిరసన తెలిపారు.


పేర్ని నాని చెప్పుకునే అభివృద్ది ఇదేనా అంటూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఎద్దేవా  చేశారు.  మూడేళ్ళల్లో మచిలీపట్నంతో పాటు, రాష్ట్రాన్నే పూర్తిగా ముంచేశారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర  మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారుల అధ్వానంగా ఉన్నా అడ్డగోలుగా సమర్ధించుకుంటున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర  అన్నారు. గొప్పలు చెప్పుకునే పేర్ని నాని ముందు నియోజకవర్గంలో రోడ్లు వేయించాలని  టీడీపీ నేత కొల్లు రవీంద్ర కోరారు.  ఓట్లు వేయించి గెలిపించిన ప్రజల పాట్లు కనిపించవా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: