మోదీ ఆకట్టుకునేందుకు ఏ ఛాన్స్ వచ్చినా చంద్రబాబు వదలట్లేదు.. ప్రధానమంత్రి మోదీ  ప్రారంభించిన  36వ జాతీయ క్రీడల్లో పాల్గోంటున్న క్రీడాకారులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.  2002లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించామని చంద్రబాబు చెప్పుకొస్తునత్నారు.  హైదరాబాద్ తో పాటు విశాఖను కూడా నాడు క్రీడా వేదికగా చేశామని చంద్రబాబు తెలిపారు.

ఒంగోలు గిత్తను 'వీర' పేరుతో మస్కట్ గా పెట్టి నిర్వహించిన జాతీయ క్రీడల ద్వారా దేశం దృష్టిని ఆకర్షించామంటున్నారు. దేశానికే తలమానికంగా ఉండేలా హైదరాబాద్ లో పలు స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపట్టామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. నాటి జాతీయ క్రీడల నిర్వహణతో ప్రజల్లో క్రీడాభిలాషను కలిగించి, అనేక మంది క్రీడలను తమ జీవిత లక్ష్యంగా ఎంచుకునే వాతావరణం కల్పించామని ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: