చిత్తడి నేలల పరిరక్షణకు సంబంధించి రెవెన్యూ, వ్యవసాయం, అటవీశాఖలతో సమన్వయ కమిటీని ఏపీ ప్రభుత‌్వం ఏర్పాటు చేయనుంది. కొల్లేరు, నేల‌ప‌ట్టు, పులికాట్, కొరింగ‌, శ్రీ‌కాకుళంలోని ప‌లు ప్రాంతాల్లో 30 వేల ఎకరాల మేర చిత్తడి నేల‌లు ఉన్నాయి. కొల్లేరు, పులికాట్ లాంటి చోట్ల  అరుదైన విదేశీ ప‌క్షులు, జీవజాలం ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించిన ఈ చిత్తడి నేలల్లో ఆక్రమణలు చోటు చేసుకున్నాయి.


అంతే కాదు.. కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2 వ కాంటూరు వ‌ర‌కు చేప‌ల చెరువులు విస్తరించాయి. అందుకే ఈ వ్యవహారాలపై రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఇటీవల మంత్రి ఆదేశించారు. వెట్ ల్యాండ్ బోర్డు ఆధ్వర్యంలో చిత్తడి నేలలు, అందులోని వన్యప్రాణులు, జీవజాలం సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేశారు. సచివాలయంలో చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించిన అంశంపై ఇటీవల మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: