తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉదయం 6 గంటలకు జరిగిన చక్రస్ధానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో అఖరి వాహనమైన అశ్వవాహన సేవ తిరుమలలో వైభవంగా జరిగింది. ఎనిమిది రోజులుగా వివిధ వాహన సేవలపై దర్శన మిచ్చిన శ్రీవారి ఉత్సవాలలో అఖరిగా సుమధురమైన పుష్పమాలికలు, ఆభరణాలు ధరించి కల్కిఆవతారంతో తిరుమలేశుడు భక్తులకు సాక్షాత్కరించారు. విష్ణుదేవుని ఆవతారాలు పది ప్రసిద్ధమైనవి కాగా వాటిలో చివరి అవతారం కల్కిఅవతారం. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కిరూపం ధరించి, చర్ణాకోలు చేతబూని అశ్వవాహనధారుదై దుష్టజన సంహారం, శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చెబుతాయి.

అశ్వ వాహన సేవలో నిన్న మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారికి భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. తిరువీధుల్లో కళాబృందాల ప్రదర్శనలు యాత్రికులను అలరించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: