ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు, డాలర్ తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ భారీగా పతనం కావడంతో ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని లిజ్ ట్రస్ పన్ను కోత ప్రణాళికను ప్రకటించడం పట్ల ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. బ్రిటన్ ను ముందుకు తీసుకెళ్లాలన్న తమ నిర్ణయానికి పన్ను కోత అంశం అడ్డంకిగా మారిందని లిజ్ ట్రస్ అంటున్నారు. వృద్ధికి చర్యలు తీసుకుంటూ దేశంలో ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.

అందుకే సంపన్నులకు ఆదాయపు పన్ను కోత విధించాలన్న నిర్ణయం పై బ్రిటన్  ప్రధాని లిజ్  ట్రస్  వెనక్కి తగ్గారు. సంపన్నులకు పన్నుల్లో రాయితీ కల్పిస్తామని ప్రధాని పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసిన లిజ్  ట్రస్ ... 10 రోజుల క్రితం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ లో దానిపై  సంబంధించిన ప్రకటన చేశారు. కానీమార్కెట్  ఒడుదొడుకులు, అధికార కన్జర్వేటివ్  పార్టీలో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ప్రధాని వెనక్కి తగ్గారు.


మరింత సమాచారం తెలుసుకోండి: