బండారు దత్తాత్రేయ నిర్వహించే అలాయ్ బలాయ్ వేడుకలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిధులకు తెలంగాణకు చెందిన కళారూపాలు ఆకట్టుకుంటాయి. శాఖాహారం, మాంసాహారం వంటకాలు నోరూరిస్తాయి. అంబలితో మొదలు చికెన్, మటన్, బోటి, తలకాయ, పాయ, రొయ్యలు, చేపలు, బగారా రైస్, సర్వపిండి, పచ్చి పులుసు, రవ్వ లడ్డు, డబల్ కమిఠా వంటి దాదాపు 40రకాల వంటకాలను అతిధులకు రుచి చూపిస్తారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ అలయ్ బలయ్ కార్యక్రమం ఉద్యమానికి ఊపునిచ్చింది. ఉద్యమకారులందరికి ఒక వేదికనిచ్చింది. సకలజనులకు ఒక భరోసానిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించింది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా తెలంగాణ రాజకీయ సాహితి సాంస్కృతిక రంగాలలో ప్రముఖులతో పటు వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించి వారిని బండారు దత్తాత్రేయ సన్మానించి.. సత్కరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: