విదేశాల నుంచి డ్రగ్స్ విచ్చల విడిగా ఇండియాలోకి వస్తున్నాయా.. ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సముద్ర మార్గంలో వస్తున్నాయా..అంటే అవుననే అనిపిస్తోంది. మన దేశ పశ్చిమ తీరంలో తరచూ పెద్ద ఎత్తున డ్రగ్స్  పట్టుబడుతున్నాయి. ఇటీవల కేవలం రెండు రోజుల వ్యవధిలో 1600 కోట్ల రూపాయలకు పైగా మాదక ద్రవ్యాలను ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం కొచ్చి,  ముంబయిల్లో రూ. 1320 కోట్ల రూపాలయ డ్రగ్స్ పట్టుపడిన సంగతి తెలిసిందే.


ఆ తర్వాత శనివారం గుజరాత్ లోని అరేబియా సముద్ర తీరంలో రూ. 350 కోట్ల విలువైన హెరాయిన్ ను పట్టుకున్నారు. హెరాయిన్  తరలిస్తున్న ముఠాకు చెందిన ఆరుగురిని భారత నౌకాదళం అరెస్ట్  చేసింది. గుజరాత్  తీర రక్షణదళం, ఉగ్రవాద నిరోధక బృందం కలిసి ఈ సంయుక్త ఆపరేషన్  నిర్వహించాయి. భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించిన పడవ అనుమానాస్పదంగా కదలటాన్ని గమనించిన నౌకా దళం ఉగ్రవాద నిరోధక బృందంతో కలిసి డ్రగ్స్ స్మగ్లర్ల ఆటకట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: