తెలంగాణకు కేంద్రం ఎలాంటి తోడ్పాటు అందించకపోగా అన్యాయం చేస్తోందని తెలంగాణలోని పలు విద్యార్థిసంఘాలు మండిపడ్డాయి.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ 12వ తేదీన నిరనస కార్యక్రమాలు చేపడతామని, విశ్వవిద్యాలయాల్లో నల్లజెండాలు ఎగరవేస్తామని ఈ విద్యార్థి సంఘాలు తెలిపాయి. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే ఆమోదించాలని ఈ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశాయి.


ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును ఆమోదించకుండా రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించిన విద్యార్థి సంఘాల నాయకులు.. బిల్లు ఆమోదించకపోతే రాజ్ భవన్ ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థి, యువత వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విభజనచట్టం హామీలు వెంటనే నెరవేర్చాలని, జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: