నిజామాబాద్‌ జిల్లా నాందేవ్‌గూడకు చెందిన హారిక యూట్యూబ్‌లో క్లాసులు విని ఎంబీబీఎస్‌కు అర్హత సాధించింది. హారిక వైద్య విద్యనభ్యసించేందుకు ఫీజు కట్టలేక దాతల కోసం ఎదురు చూసింది. ఆమె పరిస్థితిని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న కవిత హారికను కలుసుకుని ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసా కల్పించి మొదటి ఏడాదికి సంబంధించిన కాలేజీ ఫీజును చెక్కు రూపంలో అందించారు.


చదువుకోవాల్న ఆకాంక్ష,తపన ఉంటే ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని కవిత స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని కొనియాడారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంబీబీఎస్‌ చదువులో రాణించి వైద్యురాలిగా సమాజ సేవలు అందించాలని కవిత ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కవిత వైద్య విద్య చదువుకు అండగా నిలిచినందుకు హారిక తోపాటు అమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: