విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు విషయంపై తెలంగాణ గవర్నర్ పట్టు బిగించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును యూజీసీకి పంపారు పరిశీలన కోసం. దీంతో కేసీఆర్ సర్కారు దిగొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ విషయంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొన్ని సందేహాలు లేవనెత్తుతూ రాజ్ భవన్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ వచ్చిందన్న మంత్రి... రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ ను కలవాలని తనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని వివరించారు.


ఇప్పటికే సమయం కోరామని గవర్నర్ సమయం ఇచ్చాక వెళ్లి కలుస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బిల్లుకు సంబంధించి న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేస్తామని, అన్ని అంశాలను వివరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నిజాం కళాశాల వసతిగృహం వివాదంపై వీసీ, ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యార్థులను పిలిచి మాట్లాడతామని, న్యాయం చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: