ఎర్రచందనం దొంగలకు రాజకీయ నాయకులకు లింకులు ఉన్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. కొందరు నాయకులు ఈ స్మగ్లింగ్ ద్వారా కోట్లు గడిస్తున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పుడు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు సహకరించడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు.


స్మగ్లర్లతో పోరాడుతున్న అటవీశాఖ అధికారులకు మరింత అండగా ఉంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో మొత్తం 23 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అశువులు బాసారని.... ప్రాణ త్యాగాలు చేసిన వారిలో అత్యధిక శాతం ఉమ్మడి చిత్తూరు జిల్లా వారే ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అటవీశాఖ అధికారులకు దైర్యం నింపడానికే ఆయుధాలు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అధికారుల సమిష్టి కృషితో ఎర్రచందన అక్రమరవాణా అరికడతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో జూ పార్క్ లను అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: