పవన్ కల్యాణ్ తో  మాట్లాడితే ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని వాలంటీర్లు జాబితాలు పట్టుకొని లబ్దిదారుల వద్దకు వెళ్లి బెదిరిస్తున్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు ఆరోపించారు. వారిని ఇబ్బంది పెడితే తగిన ఫలితం అనుభవిస్తారని  తాతారావు హెచ్చరించారు. విజయనగరం మండలం గుంకలాం లేఅవుట్ కోసం 397 ఎకరాలు సేకరించారని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు  తెలిపారు. అక్కడ వాస్తవంగా ఎకరం ధర 10 లక్షలు అయితే.,  వైసీపీ నాయకులు 70 లక్షలకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు ఆరోపించారు.


అందులో 12,565 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు ఒక్క ఇల్లు నిర్మించలేదని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు  అన్నారు. ఇసుక, సిమెంటు మాత్రమే ఇచ్చారన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు .. పవన్ కల్యాణ్ ఇక్కడికి ఎందుకొస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారా..? అని ప్రశ్నించారు.  మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప సభాపతి కోలగట్లకు ప్రజలపై ప్రేమ ఉంటే ఇళ్లు అందించాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు  సూచించారు. విజయనగరం చైతన్యం కలిగిన జిల్లా అని.., అవినీతికి చిరునామాగా మార్చొద్దని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు తాతారావు హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: