యంగ్ హీరో  విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను బతికున్నంత వరకు శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉండేలా చూస్తానన్న విజయ్ దేవరకొండ.. తాను చనిపోయిన తర్వాత వాటిని దానం చేస్తానని ప్రకటించారు. బాలల దినోత్సవం వేళ మాదాపూర్‌లోని పేస్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో చిన్నారుల్లో కాలేయ మార్పిడి అనే అంశంపై నిర్వహించిన సదస్సులో విజయ్ దేవరకొండ ఈ మాటలు చెప్పారు.

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతోపాటు మలావత్‌ పూర్ణ కూడా పాల్గొన్నారు. కాలేయ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం వీరు 24 గంటల హెల్ప్‌లైన్‌ ను స్టార్ట్ చేశారు. వీరిద్దరూ చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. చిన్నారులకు బహుమతులు ఇచ్చారు. తాజాగా ఇప్పుడు ఆ వీడియోలను ఆస్పత్రి వర్గాలు పోస్ట్‌ చేశాయి. ఈ వీడియోలు చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విజయ్‌ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ మంచి మనసున్న హీరో అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

vd