కార్తీక మాసం అంటేనే వనభోజనాలు, వన సమారాధనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అనేక కులాల వారు, సంఘాల వారు వనభోజనాలకు వెళ్తుంటారు. అయితే.. ఈ వన సమారాధనలో అక్కడక్కడా అపశ్రుతులు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో  ఆలపాటి వారి తోటలో జరిగిన వనసమారాధన కార్యక్రమంలో తేనెటీగలు దాడి చేశాయి. ఈ తేనెటీగల దాడిలో పలువురు గాయపడ్డారు.  

ఆలపాటి వారి కుటుంబసభ్యులు వారి తోటలో కార్తీక వనసామారధన జరుపుతుండగా ీ ఘటన జరిగింది. చెట్టుపై ఉన్న తేనెటీగలు  ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో అక్కడ ఆటపాటలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్న వారంతా పరుగులు తీశారు. ఓ పాతిక మంది వరకూ తేనెటీగల బారిన పడ్డారు. వారంతా హాహాకారాలుచేసుకుంటూ పరుగులు తీశారు. ఇందులో 10 మంది వరకు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని దగ్గరలోని ఆసుపత్రులకు చేర్చారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైద్యులు ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: