వైద్యో నారాయణో హరి అంటారు.. అలాంటిదే ఈ ఘటన కూడా. యూరినరీ బ్లాడర్ లో కేన్సర్ తో బాధపడుతున్న 75 యేళ్ల మహిళకు ఆంధ్ర హాస్పటల్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్  చేశారు . ఉయ్యూరుకు చెందిన మహిళ మూత్ర సమస్యలతో ఆంధ్ర ఆసుపత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు యూరినరీ బ్లాడర్ లో కాన్సర్ కణితి ఉందని గుర్తించారు . సాధారణంగా ఈ ఆపరేషన్ ఓపెన్ సర్జరీ విధానంలో చేస్తారు.

ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు మాత్రం లాప్రోస్కోపి విధానం ద్వారానే కణితిని తొలగించారు.  లాప్రోస్కోపి విధానంలో శరీరంపై కోత ఉండదు. తక్కువ రోజుల్లోని రికవరీ ఉంటుంది. రక్తం వృథా చాలా తగ్గుతుంది. నూతన విధానం ద్వారా శస్ర్తచికిత్స చాలా అరుదుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నారు. వైద్యులు నొప్పి లేకుండా ఆపరేషన్ చేశారని పేషెంట్ ఆనందపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: