సీజన్ కావడం.. కొవిడ్ ఆంక్షలు లేకపోవడంతో శబరిమల అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. లక్షలాదిగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. రోజుకు 70 వేల మంది వరకు భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. రెండేళ్లుగా కొవిడ్ ఆంక్షల కారణంగా రోజుకు 30 వేల మంది వరకు మాత్రమే భక్తులే అనుమతించారు. డిసెంబర్ 27 వరకు మండల పూజ ఉత్సవం కొనసాగనుంది.

మకరవిళక్కు సీజన్  డిసెంబర్  30 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ఉంటుంది. జనవరి 20న దేవాలయాన్ని మూసివేస్తారు. 41 రోజుల పాటు సాగే మండల పూజ ఉత్సవంలో భాగంగా నవంబర్  17వ తేదీన శబరిమల గుడిని తెరిచారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయంలో దర్శన సమయాన్ని కూడా దేవస్థానం పెంచింది.  ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు..మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి దర్శనం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: