ఏపీ సీఎం జగన్ త్వరలో 50 ఏట అడుగు పెట్టబోతున్నారు. ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది వైసీపీ. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పేరుతో రాష్ట్రంలో సంబరాలు నిర్వహిస్తోంది. మొన్న తిరుపతిలో ఈ సంబరాలు జరిగాయి. ఇప్పుడు గుంటూరులో ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ సంబరాలను ప్రారంభించారు. కళాకారులతో కలిసి ఆమె చిందులేశారు..  డప్పులు చిడతలు కొట్టారు. ప్రాచీన కళలను ప్రజలకు తెలియజేస్తూ ఆయా కళాకారులను గుర్తించేందుకు సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు రోజా.

ఈకార్యక్రమం ద్వారా కళాకారుల వివరాలను సేకరిస్తున్నామని మంత్రి రోజా తెలిపారు. గత ప్రభుత్వాలు కళాకారులను ప్రొత్సహించేలా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. నటి అయిన నేను కళారంగానికి సేవ చేయాలని..పేద కళాకారులను ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు రోజా. జానపద, డప్పు నృత్యాలను మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వీక్షించారు. జానపద కళాకారులతో కలిసి రోజా నృత్యం చేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి: