తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు టీచర్లు ఆందోళన చేస్తున్నారు. క్రమబద్ధీకరణ చేస్తామని వైసీపీ మ్యానిఫెస్టోలో పెట్టిందని ఏపీ ప్రభుత్వ విద్యా సంస్థల కాంట్రాక్టు టీచర్ల ఫెడరేషన్ చైర్మన్ బి. జె గాంధీ తెలిపారు. ఇప్పుడు 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నవారిని మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తామని అంటున్నారని కాంట్రాక్టు టీచర్ల ఫెడరేషన్ చైర్మన్ బి. జె గాంధీ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 700 మంది మాత్రమే క్రమబద్ధీకరణ అవుతారన్న కాంట్రాక్టు టీచర్ల ఫెడరేషన్ చైర్మన్ బి. జె గాంధీ.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 వేలమంది ఒప్పందం అధ్యాపకులు ఉన్నారని తెలిపారు.


కేవలం 700 మందిని మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తే మరి మిగిలిన వారి సంగతి ఏంటి అని కాంట్రాక్టు టీచర్ల ఫెడరేషన్ చైర్మన్ బి. జె గాంధీ నిలదీశారు. తెలంగాణలో 2014 జూన్ 2 వరకు ఎంత మంది పని చేస్తున్నారో వారిని క్రమబద్ధీకరణ చేస్తున్నారని కాంట్రాక్టు టీచర్ల ఫెడరేషన్ చైర్మన్ బి. జె గాంధీ గుర్తు చేశారు. ఈ విద్యా సంవత్సరం అధ్యాపకులను 10 నెలలు మాత్రమే ఉద్యోగ ఒప్పందాన్ని పొడిగించారని కాంట్రాక్టు టీచర్ల ఫెడరేషన్ చైర్మన్ బి. జె గాంధీ స్పష్టంచేశారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమని కాంట్రాక్టు టీచర్ల ఫెడరేషన్ చైర్మన్ బి. జె గాంధీ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: