సీఎం జగన్డి అసమర్థతతో ఆరోగ్యశ్రీకి అనారోగ్యం పట్టిందని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ విమర్శించారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు 450 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ తెలిపారు. సీఎం జగన్.. సీఎంఆర్ఎఫ్ ను ఐసీయూలోకి నెట్టేశారని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ఆక్షేపించారు. కొత్త మెడికల్ కాలేజీల పేరుతో మూడున్నరేళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని గ్రీష్మ ఆరోపించారు.


కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టడంతో ఏపీకి రెడ్ నోటీస్ జగన్ రెడ్డి వైఫల్యమేనని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ  తేల్చి చెప్పారు. మూడున్నరేళ్లలో వైద్యరంగాన్ని భ్రష్టు పట్టించారన్న టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ... నాడు-నేడు కింద వైద్యరంగంలో విప్లవమంటూ బూటకపు మాటలని మండిపడ్డారు. ఏపీ వైద్య విధానం దేశానికే ఆదర్శమని మంత్రి విడదల రజని ప్రచార ఆర్భాటమని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నరక కూపాలను తలపిస్తున్నాయని గ్రీష్మ దుయ్యబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: