ఇవాళ భారత్‌ బంద్.. ఎందుకంటే.. నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫ్రంట్ ఈ బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఇటీవల అగ్రవర్ణ పేదలకు కేంద్రం రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ EWS రిజర్వేషన్లు రాజ్యాంగబద్దమేనని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. అయితే వీటిని అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లుగా కాకుండా.. కేవలం ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు రిజర్వేషన్లుగా చట్టంలో పేర్కొన్నారు.


ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లలో ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను మినహాయించారు. ఇలా వివక్ష చూపడంపై బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ కారణంగానే ఇవాళ నేషనల్‌ బీసీ ఫ్రంట్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా 29 నవంబర్ భారత్ బంద్ అనే హ్యాష్‌ ట్యాగ్‌ బాగా ట్రెండింగ్‌లో ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ ప్రభావం నామమాత్రంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: