జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జనసేన జగనన్న కాలనీల సమస్యలపై పోరాటం ప్రారంభించింది. నిర్మాణంలో ఉన్న కాలనీలను సందర్శించి.. లోపాలను ఎత్తి చూపింది. దీన్ని మంత్రి జోగి రమేశ్ తప్పుబట్టారు. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు, పవన్, జగనన్న కాలనీల్లోకి వస్తారని మంత్రి జోగి రమేశ్  నిలదీశారు. జగన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబుకి  ధైర్యం లేదన్న మంత్రి జోగి రమేశ్ .. దమ్మున్న నాయకుణ్ణి ఎదుర్కోవాలంటే పొత్తులు పెట్టుకోవాల్సిందేనన్నారు.


రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళ గిరిలో లోకేష్ ఒడిపోబోతున్నారని మంత్రి జోగి రమేశ్  జోస్యం చెప్పారు. ఇక పవన్‌ విషయానికి వస్తే.. అసలు 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను నిలబెట్టగలడా? అని మంత్రి జోగి రమేశ్  ప్రశ్నించారు. అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని.. కరోనా సమయంలో కూడా ఇళ్ల నిర్మాణం ఆపలేదని మంత్రి జోగి రమేశ్  గుర్తు చేశారు. టిడిపి హయాంలో ఎవరికైనా ఒక సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవన్న మంత్రి జోగి రమేశ్.. పేదలకు ఇళ్ళు నిర్మిస్తున్న ప్రభుత్వం పైచంద్రబాబు కి ఎందుకు కక్ష అని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: