వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిందితులతో కుమ్మక్కయిందని.. సీబీఐ దర్యాప్తుకు అడ్డంకులు సృష్టిస్తుందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు. ఏపీ లో నిష్పాక్షిక విచారణ జరగదని, సుప్రీం కోర్టు ధర్మాసనం దర్యాప్తును ఏపీ నుండి తెలంగాణకు బదిలీ చేయడం తీవ్రమైన అంశమన్న కాంగ్రెస్ నేత తులసి రెడ్డి.. గతంలో చిన్న చిన్న ఆరోపణలకే ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు.


నీలం సంజీవ రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి.. తమ ప్రభుత్వం పై కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చేశాయని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నైతిక విలువలు కాపాడారని  కాంగ్రెస్ నేత తులసి రెడ్డి  అన్నారు. అదే విధంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యం లో ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలని  కాంగ్రెస్ నేత తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించడం లో ప్రభుత్వ దురుద్దేశం వుందన్న  కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఎన్నికల సిబ్బందిగా వుంటేనే ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: