రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఆ తర్వాత విజయవాడలోని రాజ్ భవన్ లో..గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశం అవుతారు. ఆయన ఇచ్చే అధికారిక విందుకు హాజరవుతారు. తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు.

విశాఖలో జాతీయ రహదారుల సంస్ధ ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  పాల్గొంటారు. నూతన రహదారులకు ప్రారంభించి, శంఖుస్థాపనలు చేస్తారు. ఈనెల 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ నుంచి తిరుపతి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత గోశాలను సందర్శించి..పద్మావతి మహిళా యూనివర్సీటీ విద్యార్థులతో భేటీ అవుతారు. తిరుపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  నుంచి నేరుగా దిల్లీకి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన కోసం...పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: