ఈ ఏడాది నవంబర్ నెలలో రైల్వేకు ఆదాయం బాగా పెరిగింది. ఈ మాసంలో సరుకు రవాణా చేయడం, ప్రయాణికులను చేరవేయడం ద్వారా అత్యధిక ఆదాయన్ని సాధించిందని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నవంబర్ లో ప్రయాణికులతో రూ.435.66 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే సరుకు రవాణాతో రూ.1,083.63 కోట్లు సమకూరినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.


నవంబర్ మాసంలో దక్షిణ మధ్య రైల్వే 93 ప్రత్యేక రైళ్లను 460 ట్రిప్పులు నడిపించింది. మొత్తం 2.82 లక్షల ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. మరో 625 ప్రత్యేక కోచ్ ల ద్వారా 42,757 మంది అదనపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర వేసింది. ఈ నవంబర్ లో 10.481 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు రైల్వే తెలిపింది. గత ఏడాదితో పోల్చితే 15శాతం అదనంగా రవాణా చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: