దిల్లీ మద్యం కేసులో సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెడీ అవుతోంది. ఈనెల 11న కవితను విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. హైదరాబాద్ లోని కవిత నివాసంలో 11వ తేదీన ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సీబీఐ తెలిపింది. హైదరాబాద్ లేదా దిల్లీలో విచారణ జరుపుతామని కవితకు సీబీఐ గతంలో సీఆర్‌పీసీ 160 నోటీసు ఇచ్చింది. హైదరాబాద్ నివాసంలో అందుబాటులో ఉంటానని సీబీఐ అధికారులకు ముందుగా సమాచారం ఇచ్చిన కవిత ఆ తర్వాత రూట్ మార్చేశారు.


ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున వీలు కాదని సీబీఐ దిల్లీ డీఐజీకి మెయిల్ పంపించారు. ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్ లో అందుబాటులో ఉంటానని కవిత మెయిల్‌లో పేర్కొన్నారు. కవిత మెయిల్ కు దిల్లీ సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స రిప్లై ఇచ్చారు. ఈనెల 11న తమ బృందం వచ్చి విచారణ జరిపి వాంగ్మూలం నమోదు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: